ఒంగోలు నియోజకవర్గం నుంచి 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన దామచర్ల జనార్దన్ ఓటమిపాలయ్యారు. ఆ తరువాత 2014 ఎన్నికల సమయంలో ఈ సీటు కోసం దామచర్ల సత్య ప్రయత్నించారు. అయితే జనార్దన్ వైపే అధిష్టానం మొగ్గుచూపింది. ఆ ఎన్నికల్లో జనార్దన్ విజయం సాధించడంలో సత్య కీలకపాత్ర పోషించినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నారు. దాంతో సత్య ఎప్పటికైనా తనకు పోటీగా ఎదుగుతాడన్న అనుమానం జనార్దన్‌లో బలంగా నాటుకొని పోయిందని అంటున్నారు. ఈ క్రమంలోనే 2016లో సత్య పుట్టిన రోజు సందర్భంగా ఒంగోలు నగరంలో ఏర్పాటు చేసిన సత్య ఫ్లెక్సీలను చించేసినట్లు అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. అప్పటి నుంచి స్వగ్రామమైన తూర్పు నాయుడు పాలెంలోనే సత్య పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సత్యకు మారిటైం బోర్డు చైర్మన్ పదవి రాకుండా చేయడానికి ఎమ్మెల్యే జనార్దన్ చివరి నిముషం వరకు ప్రయత్నించినట్లు సమాచారం. అయితే లోకేష్‌తో ఉన్న సాన్నిహిత్యంతో సత్య కార్పొరేషన్ పదవిని తెచ్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment