
ప్రకాశం
ఇంటర్ పరీక్షలకు 733 మంది గైర్హాజరు
36.7/25
9
గరిష్టం/కనిష్టం
ఒంగోలు సిటీ: ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం ఇంగ్లిష్ పరీక్ష బుధవారం ప్రశాంతంగా జరిగింది. రెండో రోజు 19,047 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 733 మంది గైర్హాజరయ్యారు. 18,314 మంది హాజరయ్యారు. ఇందులో జనరల్ 17,140 మంది విద్యార్థులకు గాను 16,574 మంది విద్యార్థులు హాజరవగా, 566 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ పరీక్షకు గాను 1907 మందికి గాను 1740 మంది విద్యార్థులు హాజరవగా 167 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలో 67 సెంటర్లలో విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఆరుగురు ఆర్‌ఐఓలు, 12 మంది డీఈసీలు, 33 మంది స్క్వాడ్స్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.
వాతావరణం
ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉక్కపోతగా ఉంటుంది. రాత్రి చలిగాలులు వీస్తాయి.
గురువారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 2025

ప్రకాశం

ప్రకాశం
Comments
Please login to add a commentAdd a comment