● మాజీ మంత్రి, పీఏసీ సభ్యుడు డాక్టర్ ఆదిమూలపు సురేష్
సింగరాయకొండ: కొండపి మండలం పెద్ద కళ్లగుంట సర్పంచ్ భువనగిరి సత్యన్నారాయణకు ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా చెక్‌పవర్ రద్దు చేయటం దారుణమని, అప్రజాస్వామిక చర్య అని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి, పీఏసీ సభ్యుడు డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. పార్టీ క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన కూటమి ప్రభుత్వం చేపడుతున్న అప్రజాస్వామిక చర్యలను ఎండగట్టారు. డాక్టర్ సురేష్ మాట్లాడుతూ ఒక సర్పంచ్‌కు ముందస్తు నోటీసు ఇవ్వకుండా, అతని సంతకం తీసుకోకుండా ఏ ప్రాతిపదికన చెక్‌పవర్ రద్దు చేస్తారని? దీనికి ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖా మంత్రి పవన్‌కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది కేవలం కక్ష సాధింపు చర్యఅని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క పనిచేయనీకుండా అడ్డుకుంటున్నారని, ప్రస్తుతం గ్రామంలో తాగునీటి సరఫరా టీడీపీ నాయకుల పర్యవేక్షణలోనే జరుగుతుందని, ఆరునెలలుగా వీధిదీపాలు లేక గ్రామం అంధకారంలో ఉందని, ఇదేనా గ్రామ స్వరాజ్యం అని ఎద్దేవా చేశారు. గతంలో సర్పంచ్ సత్యన్నారాయణ పనిచేసిన రూ.3 లక్షల బిల్లులు డ్రా చేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇకనైనా కక్ష సాధింపు చర్యలు మానుకుని గ్రామాభివృద్ధికి కృషి చేయాలని, చెక్‌పవర్‌ను పునరుద్ధరించాలని ప్రభుత్వానికి సూచించారు.
వైఎస్సార్ విగ్రహాన్ని అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలి
● నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్‌ఖాన్
ఒంగోలు టౌన్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని అవమానపరిచిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్‌ఖాన్ డిమాండ్ చేశారు. దేశంలో మొట్టమొదటిసారిగా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలుచేసి నిరుపేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేలా సాయపడిన మహానేత విగ్రహంపై కూర్చోవడం, కాలితో తన్నడం మూర్ఖపు చర్యని అన్నారు. మూర్ఖంగా ప్రవర్తించిన విద్యార్థులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment