మద్యం మత్తులో లారీ డ్రైవర్ బీభత్సం
● ఒకరికి తీవ్ర గాయాలు
బేస్తవారిపేట: మద్యం మత్తులో లారీ డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. ఈ సంఘటన బేస్తవారిపేట బస్టాండ్ ఆవరణలో గురువారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే.. అర్థవీడు మండలం కాకర్లకు చెందిన రైతు ట్రాక్టర్‌పై పొగాకు బేళ్లను బేస్తవారిపేట జంక్షన్ వైపునకు తీసుకువెళ్తున్నాడు. అదే సమయంలో లారీలో బెంగుళూరు నుంచి విజయవాడకు ప్రైవేట్ కంపెనీ బ్యాటరీలను తరలిస్తున్నారు. లారీ డ్రైవర్ పూటుగా మద్యం సేవించి ట్రాక్టర్ వెనుక వైపున ట్రాలీని ఢీకొట్టాడు. దీంతో ట్రాలీలోని పొగాకు బేళ్లు రోడ్డుపై అడ్డదిడ్డంగా పడిపోయాయి. పొగాకు బేళ్లు సర్వీస్ రోడ్డులో తోపుడు బండ్లపై పడటంతో పండ్లు నేలపాలయ్యాయి. ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీ అదుపుతప్పి రోడ్డు మార్జిన్‌లో కంభం వైపు మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టింది. మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న ఆర్మీ ఉద్యోగి బీరబోయిన నాగేంద్రను మోటార్‌సైకిల్‌తో కొద్ది దూరం లారీ లాక్కెళ్లింది. ప్రమాదంలో నాగేంద్ర చెయ్యి నుజ్జు నుజ్జు కాగా తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని 108లో కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. డ్రైవర్ లారీని ఆపకుండా పరారవుతుండటంతో పోలీసులు వెంబడించి పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
మద్యం మత్తులో లారీ డ్రైవర్ బీభత్సం
Comments
Please login to add a commentAdd a comment