ధ్యానం, వ్యాయామంతో ఆరోగ్యం
● ఏకేయూ వీసీ ప్రొఫెసర్ మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ హరిబాబు
ఒంగోలు సిటీ: ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ధ్యానం, వ్యాయామం ముఖ్యమైనవని ఏకేయూ వీసీ ప్రొఫెసర్ మూర్తి, రిజిస్ట్రార్ ఫ్రొఫెసర్ బి.హరిబాబు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకొని ఆంధ్రకేసరి యూనివర్శిటీ సమావేశపు హాలులో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్) ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సమావేశానికి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజమోహన్ రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమనే సూత్రాన్ని ధనిక, పేద అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. సూర్యోదయాన్నే చేపట్టాల్సిన ధ్యానం, వ్యాయామం తదితర సన్మార్గాల గురించి వివరించారు. వ్యాయామం, ధ్యానం అనేవి వయసుతో నిమిత్తం లేకుండా ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ చేపట్టవచ్చన్నారు. వైద్యులు డాక్టర్ ప్రసాదరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పక ఆరోగ్య సూత్రాలు పాటించాలన్నారు. ఈ సందర్భంగా పలువురు యోగా మాస్టర్లు యోగసానలు వేసి చూయించారు. ఏకేయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ దేవీ వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment