జగనన్న పాలనలో మహిళలకు సమాన అవకాశాలు
చీమకుర్తి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనా కాలంలో సంక్షేమ పథకాలు, పార్టీ పదవుల్లో 50 శాతం మహిళలకే కట్టబెట్టారని జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం చీమకుర్తిలోని బీవీఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో కాలేజీ మహిళా లెక్చరర్లు, సిబ్బంది ఆధ్వర్యంలో బూచేపల్లి వెంకాయమ్మను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. మహిళల రక్షణకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిశ యాప్‌ను తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని కాలేజీ విద్యార్థినులతో కలిసి ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ
Comments
Please login to add a commentAdd a comment