షిఫ్ట్ ఆపరేటర్‌పై లైన్‌మన్ దౌర్జన్యం
కొమరోలు: విద్యుత్ సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్ ఆపరేటర్‌పై లైన్‌మన్ తన అసిస్టెంట్‌తో కలిసి దౌర్జన్యం చేసి దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన సోమవారం కొమరోలు మండలం తాటిచెర్ల మోటు విద్యుత్ సబ్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది. షిఫ్ట్ ఆపరేటర్ గుర్రాల చంద్రశేఖర్ కథనం మేరకు.. తాటిచెర్ల మోటు విద్యుత్ సబ్‌స్టేషన్‌లో గత రెండేళ్ల నుంచి చంద్రశేఖర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈనెల 6వ తేదీ గురువారం రాత్రి లైన్‌మెన్ డికోజీ నాయక్ అసిస్టెంట్‌గా ఉన్న నాగూర్ అనే వ్యక్తి పూటుగా మద్యం తాగి విద్యుత్ సబ్‌స్టేషన్‌లో పడుకునేందుకు వెళ్లాడు. దీంతో శ్రీమద్యం తాగి ఉన్నావు.. ఇక్కడ పడుకోవద్దుశ్రీ అని షిఫ్ట్ ఆపరేటర్ నిరాకరించాడు. ఆ సమయంలో ఆపరేటర్‌ను తిడుతూ నాగూర్ అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయాడు. సోమవారం చంద్రశేఖర్ విధుల్లో ఉన్న సమయంలో లైన్‌మన్ డికోజీ నాయక్, అసిస్టెంట్ నాగూర్ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు చేరుకున్నారు. చంద్రశేఖర్‌పై దౌర్జన్యం చేసి దుర్భాషలాడటమే కాకుండా చేతులతో నెట్టి కొట్టారు. సబ్ స్టేషన్‌లో జరిగిన పరిణామాలపై విద్యుత్ శాఖ ఏఈకి చంద్రశేఖర్ ఫిర్యాదు చేశాడు. దీంతో విద్యుత్ లైన్‌మన్ డికోజీనాయక్, అసిస్టెంట్ నాగూర్ మళ్లీ సబ్ స్టేషన్ వద్దకు చేరుకుని ‘మాపైనే ఫిర్యాదు చేస్తావా, నీ సంగతి తేలుస్తాం, అంతు చూస్తాం’ అని బెదిరించారు. తనకు ప్రాణహాని ఉందని, రాత్రి వేళల్లో విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఒక్కడినే ఉంటానని, తనకు రక్షణ కల్పించాలంటూ సంబంధిత అధికారులను షిఫ్ట్ ఆపరేటర్ చంద్రశేఖర్ వేడుకుంటున్నాడు.
సహాయకుడికి మద్దతుగా వచ్చి దాడి చేసిన వైనం
తనకు రక్షణ కల్పించాలంటున్న
షిఫ్ట్ ఆపరేటర్ చంద్రశేఖర్
Comments
Please login to add a commentAdd a comment