డ్రోన్ కెమెరాలతో పటిష్ట నిఘా
ఒంగోలు టౌన్: జిల్లా వ్యాప్తంగా అన్నీ పోలీస్‌స్టేషన్ల పరిధిలో డ్రోన్ కెమెరాలతో గట్టి నిఘా పెట్టాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. మిస్సింగ్, పెండింగ్ కేసులు, హత్య కేసులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గుర్తు తెలియని మృతదేహాలు, కారణం తెలియని మరణాలు, అనుమానాస్పద మృతుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపి అన్నీ కోణాల్లో దర్యాప్తు పూర్తి చేయాలన్నారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, నేరాల కట్టడి, నిందితుల గుర్తింపు, చోరీ సొత్తు రికవరీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. మహిళలపై జరిగే నేరాలు, పోక్సో కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించారు. జిల్లాలోని అన్నీ సబ్ డివిజన్ల పరిధిలో శక్తి టీంలను ఏర్పాటు చేయాలని, శక్తి యాప్‌ను రిజిస్టర్ చేయించాలని చెప్పారు. సీసీ కెమెరాలు, డ్రోన్ల ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. పోలీసు శాఖపై ప్రజల్లో నమ్మకం పెరిగేలా సేవలను అందించాలని చెప్పారు. గంజాయి, ట్రాన్స్‌ఫారాల చోరీ కేసుల్లో ప్రతిభ చూపిన దర్శి సీఐ రామారావు, ముండ్లమూరు ఎస్సై నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు, కానిస్టేబుళ్లు మహేష్, మరియబాబు, కిరణ్ మహేష్, హోంగార్డులు ఖాళీం, ఖాసి రాజులను అభినందించి ప్రత్యేక ప్రశంసా పత్రాలను అందజేశారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె. నాగేశ్వరరావు, డీఎస్పీలు శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ, సాయి ఈఽశ్వర్, నాగరాజు, ఎస్‌బీ సీఐ రాఘవేంద్ర, డీసీఆర్బీ సీఐ దేవ ప్రభాకర్, ఐటీ కోర్ సీఐ సూర్యనారాయణ పాల్గొన్నారు.
నేర సమీక్ష సమావేశంలో
ఎస్పీ ఏఆర్ దామోదర్
Comments
Please login to add a commentAdd a comment