
కత్తితో చేయి కోసుకుని యువకుడు ఆత్మహత్య
కనిగిరి రూరల్: ప్రియురాలితో పెళ్లి కోసం కత్తితో చేయి కోసుకుని యువకుడు ప్రాణం తీసుకున్నాడు. ఈ సంఘటన గురువారం రాత్రి కనిగిరిలో జరిగింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన రవితేజకు కనిగిరికి ఇందిరాకాలనీకి చెందిన పుట్టా లక్ష్మీదేవితో పరిచయం ఏర్పడింది.
లక్ష్మీ భర్త ఐదేళ్ల క్రితం చనిపోయాడు. కొద్ది రోజులుగా లక్ష్మీని పెళ్లి చేసుకుంటానని రవితేజ గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో గురువారం ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన రవితేజ మద్యం సేవించి ప్రభుత్వాసుపత్రి సమీపంలో కత్తితో చేయి కోసుకున్నాడు. అధిక రక్తస్రావంతో రవితేజ మరణించినట్లు పోలీసులు తెలిపారు. వీఆర్‌ఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై టి.శ్రీరాం పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment