
మెకాట్రానిక్స్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
ఒంగోలు వన్‌టౌన్: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జర్మన్ లాంగ్వేజ్‌లో శిక్షణ, ప్లేస్‌మెంట్‌కు మెకాట్రానిక్స్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ కార్పొరేషన్ జిల్లా అధికారి రవికృష్ణయాదవ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. డిగ్రీ/డిప్లమో ఇన్ మెకాట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఎనర్జీ సిస్టం, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన 18 నుంచి 40 సంవత్సరాల వయసు మధ్య గల వారు అర్హులన్నారు. ఈ విభాగాలలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలన్నారు. శిక్షణ ఆరు నెలల పాటు ఉంటుందన్నారు. ఏ1, ఏ2, బీ1 లెవల్ శిక్షణ ఉంటుందన్నారు. అనంతరం వీసా ప్రాసెసింగ్ ఉంటుందన్నారు. అభ్యర్థులకు ఆఫ్‌లైన్‌లో విజయవాడ/విశాఖపట్నంలో శిక్షణ ఉంటుందన్నారు. బీ1 లెవల్ శిక్షణ ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్‌లో కూడా ఉంటుందన్నారు. శిక్షణ పూర్తయిన వారికి జర్మనీలో నెలకు రూ.2,800 యూరోల నుంచి రూ.3,600 యూరోల వరకూ వేతనం లభిస్తుందన్నారు. వీసా, ఫ్‌లైట్ ఖర్చులను ఉద్యోగం కల్పించే కంపెనీనే భరిస్తుందన్నారు. కంపెనీ ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కల్పించనున్నట్లు చెప్పారు. డాక్యుమెంట్ ఖర్చులకు సుమారు రూ.30,000 వరకూ అభ్యర్థి చెల్లించాల్సి ఉంటుందన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులు రెండు విడతలుగా రూ.40,000 రీఫండ్‌బుల్ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులు జర్మనీ వెళ్లిన తర్వాత ఈ డిపాజిట్లను తిరిగి చెల్లించడం జరుగుతుందన్నారు. పాస్‌పోర్టు, పాస్‌పోర్టు సైజు ఫొటోలు రెండు, 10వ తరగతి మార్కుల మెమో, డిగ్రీ/డిప్లమో ధ్రువీకరణ పత్రం, అనుభవ ధ్రువీకరణ పత్రం, లైటు, లేదా హెవీ వెహికల్ లైసెన్సులను అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు జతపరచాలన్నారు. శిక్షణకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ ఈ నెల 25 అని తెలిపారు. ఇతర వివరాలకు 99888 53335, 87901 18349 నంబర్లను సంప్రదించాలని రవికృష్ణయాదవ్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment