
పోగొట్టుకున్న బంగారం బాధితులకు అప్పగింత
మార్కాపురం టౌన్: మార్కాపురం మండలంలోని రామచంద్రకోటకు చెందిన వెన్నా కాశిరెడ్డి దంపతులు తమ నగదు, బంగారంను పోగొట్టుకోగా.. పోలీసులు గుర్తించి గురువారం అప్పగించారు. టౌన్ ఎస్సై సైదుబాబు కథనం ప్రకారం.. కాశిరెడ్డి దంపతులు పట్టణంలోని ఎస్వీకేపీ కళాశాల సమీపంలోని తన అక్క ఇంటికి బుధవారం వచ్చారు. అదే రోజు సాయంత్రం తూర్పువీధి మీదుగా స్వగ్రామానికి వెళ్లే సమయంలో బ్యాగును దారిలో పోగొట్టుకున్నారు. బ్యాగ్‌లో 4 తులాల బంగారు నల్లపూసల దండ, బంగారు చైను, 1,61,500 నగదు ఉండటంతో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తూర్పువీధిలోని వాగ్దేవి కళాశాల వద్ద ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజ్‌ను పరిశీలించారు. తూర్పువీధికి చెందిన ఓ మహిళ వద్ద బ్యాగ్ ఉన్నట్లు తేలడంతో వెంటనే స్వాధీనం చేసుకున్నారు. పోగొట్టుకున్న నగదును సీసీ కెమెరాల ద్వారా ఒక్కరోజులోనే గుర్తించి అప్పగించిన ఎస్సైలు సైదుబాబు, డాక్టర్ రాజమోహన్‌రావును సీఐ సుబ్బారావు అభినందించారు. బాధితుడు కాశిరెడ్డి పట్టణంలో 4 సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారని సీఐ తెలిపారు.
సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించిన పోలీసులు
4 సీసీ కెమెరాల ఏర్పాటుకు
సహకరిస్తామన్న బాధితులు
Comments
Please login to add a commentAdd a comment