
మంచాన పడ్డా..నా కుమారులు పట్టించుకోవడం లేదు..!
● పోలీసులను ఆశ్రయించిన ఓ తండ్రి
గిద్దలూరు రూరల్: ఆరోగ్యం బాగోలేదు.. ఆదుకోవాలని ప్రాధేయపడుతున్నా నా కుమారులు పట్టించుకోవడం లేదంటూ ఓ తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. గిద్దలూరు మండలం కె.ఎస్.పల్లెకు చెందిన శివాపురం రామకృష్ణ.. భార్య విజయతో కలిసి దుస్తుల వ్యాపారం చేసుకుంటూ తన ఇద్దరు కుమారులైన లక్ష్మీనారాయణ, గణేష్‌లను చదివించాడు. పిల్లలపై ప్రేమతో లక్షలు ఖర్చు చేసి ఉన్నత విద్య అందించాడు. ఇందుకోసం సుమారు రూ.30 లక్షల మేరకు అప్పులు కూడా చేశాడు. చివరికి రూ.50 లక్షల విలువ చేసే ఇంటిని కూడా కుమారుల పేరుతో రిజిస్టర్ చేశాడు. ప్రస్తుతం కుమారులిద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా స్థిరపడ్డారు. ఇదిలా ఉండగా, రామకృష్ణ రెండేళ్లుగా కిడ్నీ, లివర్ వ్యాధి బారినపడి మంచం పట్టాడు. దగ్గరుండి చూసుకోవాల్సిన ఇద్దరు కుమారులు మొహం చాటేయడంతో గత్యంతరం లేని పరిస్థితిలో తనకు న్యాయం చేయాలంటూ భార్యతో కలిసి గురువారం పోలీసులను ఆశ్రయించాడు. తన ఇద్దరు కుమారులూ పట్టించుకోకపోవడంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment