శక్తి యాప్ కాల్స్‌కు తక్షణమే స్పందించాలి
ఒంగోలు టౌన్: మహిళలు, బాలికలు తమకు ఎదురయ్యే వివిధ సమస్యల నుంచి బయట పడేందుకు పోలీసుల సాయం కోసం శక్తి యాప్‌కు ఫోన్లు చేస్తుంటారని, వాటికి సిబ్బంది తక్షణమే స్పందించాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూంను బుధవారం తనిఖీ చేశారు. కంట్రోల్ రూంలో అత్యవసర సేవలను అందిస్తున్న శక్తి యాప్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. స్వయంగా తన ఫోన్ నుంచి వీడియా ఎస్‌ఓఎస్‌కు కాల్ చేసి సిబ్బంది పనితీరును, తక్షణ స్పందన పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ శక్తి సిబ్బంది తక్షణమే వచ్చి కాల్ వివరాలను సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని చెప్పారు. సంబంధిత పోలీస్‌స్టేషన్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు సహాయం అందజేస్తారని తెలిపారు. సమాచారం చేరవేయడంలో ఎలాంటి జాప్యం చేసినా, నిర్లక్ష్యం వహించినా శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండి చురుగ్గా, సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఈ సందర్భంగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జరిగిన యువత పోరు ధర్నాను వీడియో వాల్ ద్వారా పర్యవేక్షించారు. ఎస్పీ వెంట అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె. నాగేశ్వరరావు, ఐటీ కోర్ సీఐ సూర్యనారాయణ, ఎస్బీ సీఐ రాఘవేంద్ర, ఐసీసీఆర్ ఎస్సై ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఎస్పీ ఏఆర్ దామోదర్
Comments
Please login to add a commentAdd a comment