దారి చూపిస్తారా..ఽ ధర్నా చేయమంటారా..?
పొదిలిరూరల్: ‘ మా పొలాలకు వెళ్లేందుకు దారి చూపిస్తారా..లేకా ధర్నా చేయమంటారా అంటూ మండలంలోని గోగినేనివారిపాలేనికి చెందిన రైతులు బుధవారం రహదారి పనులు అడ్డుకున్నారు. రైతుల పొలాలకు వెళ్లేందుకు రహదారి సౌకర్యం కల్పిస్తామని చెప్పి ఇప్పుడు పట్టించుకోకుండా పనులు చేస్తున్నారని పనులను అడ్డుకున్నారు. మండలంలోని ఉప్పలపాడు, గోగినేనివారిపాలేనికి చెందిన దాదాపు 50 మంది రైతులకు చెందిన భూములు కొనుగోలు చేసిన కేఎస్‌ఆర్ అనే సంస్థ రహదారి పనులను చేపట్టింది. దాదాపు 53 ఎకరాల భూమిని 227 మంది రైతులు రోడ్డు నిర్మాణానికి ఇస్తే మొత్తం రూ.19 కోట్లు రైతులకు రావాల్సి ఉండగా ఇప్పటికే దాదాపు రూ.9.50 కోట్లు చెలించారు. ఇంకా 50 మంది రైతులకు రూ.10 కోట్లు అందాల్సి ఉంది. అందులో గ్రానైట్ కంపెనీకు సంబంధించి రూ.6.50 కోట్లు, ఎండోమెంట్ రూ.1.50 కోట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో పొలాలకు వెళ్లేందుకు దారి లేకపోవడంతో ఆగ్రహించిన రైతులు కూలీలు చేసే రహదారి నిర్మాణ పనులను అడ్డుకొని నిరసన తెలియజేశారు. దీంతో నిర్వాహకులు రైతులకు సర్దిచెప్పి ఉన్నతాధికారులకు నివేదించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment