అడ్డగోలుగా చెట్ల నరికివేత!
హైవే అధికారుల తీరుపై విమర్శలు
బేస్తవారిపేట: స్థానిక జంక్షన్‌లో ఒంగోలు–నంద్యాల హైవేరోడ్డు పక్కన ఉన్న భారీ చింత చెట్టును నరికివేశారు. ప్లాట్లకు అడ్డుగా ఉందని జేసీబీ సహాయంతో పెకిలించి, రోడ్డుకు దూరంగా తీసుకెళ్లి ముక్కలుగా చేశారు. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. హైవే అధికారులతో మాట్లాడి చెట్టును తొలగించినట్లు ప్లాట్‌ను లీజుకు తీసుకున్న వ్యక్తులు చెప్పడం గమనార్హం. హైవే అధికారులతో మాట్లాడేందుకు రెవెన్యూ అధికారులు ప్రయత్నించగా ఫోన్ పెట్టేశారు. అడ్డగోలుగా వ్యవసాయ పొలాలను ప్లాట్లుగా మార్చేచోట భారీ చెట్లను తొలగించేందుకు హైవే అధికారులు ఎలా అనుమతిస్తారని స్థానికులు ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment