వైఎస్సార్‌ సీపీ జెండా దిమ్మె కూల్చివేత | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ జెండా దిమ్మె కూల్చివేత

Published Thu, Mar 13 2025 11:29 AM | Last Updated on Thu, Mar 13 2025 11:26 AM

వైఎస్

వైఎస్సార్‌ సీపీ జెండా దిమ్మె కూల్చివేత

కంభం: వైఎస్సార్‌ సీపీ ఆవిర్భావ దినోత్సవం రోజున టీడీపీ నేతలు కక్ష సాధింపు చర్యలకు దిగారు. బుధవారం వైఎస్సార్‌ సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కంభంలోని కందులాపురం సెంటర్‌లో ఆ పార్టీ నేతలు ఉదయం ఆవిష్కరించిన జెండాను మధ్యాహ్నానికి తొలగించి, సిమెంట్‌ దిమ్మెను ధ్వంసం చేయించారు. టీడీపీ నేతల కక్ష సాధింపు చర్యల్లో హైవే అధికారులు, పోలీసులు భాగస్వాములు కావడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరికీ ఆటంకం కలిగించని చోట, ఏళ్ల తరబడి అక్కడే ఉన్న జెండా దిమ్మెను పోలీసులను వెంటబెట్టుకొచ్చి మరీ హైవే అధికారులు ధ్వంసం చేయడంపై వైఎస్సార్‌ సీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. పార్టీ ఆవిర్భావ వేడుక ముగియగానే యువత పోరు ధర్నాలో పాల్గొనేందుకు నాయకులంతా ఒంగోలు తరలి వెళ్లగా.. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో పోలీసులు, హైవే అధికారులు తమ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. వైఎస్సార్‌ సీపీ జెండా, పక్కనే ఉన్న సీఐటీయూ, భవన నిర్మాణ కార్మిక, ఏఐటీయూసీ, ఏఐఎస్‌ఎఫ్‌ జెండాలను గడ్డపారలతో ధ్వంసం చేశారు. ఈ తతంగాన్ని పోలీస్‌ సిబ్బంది డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరించడం గమనార్హం. జెండాలు ఎందుకు తొలగిస్తున్నారని స్థానికులు ప్రశ్నించగా శ్రీఇది హైవే స్థలం. మా పైఅధికారులు చెప్పారుశ్రీ అని బదులిచ్చారు. వైఎస్సార్‌ సీపీ జెండా ఉన్న ప్రాంతంలో మొత్తం 7 జెండాలు, టీడీపీ భారీ కటౌట్‌ ఉండగా వైఎస్సార్‌ సీపీ జెండాను, మరో నాలుగింటిని మాత్రమే తొలగించడం కక్ష సాధింపులో భాగమేనని విమర్శలు వ్యక్తమయ్యాయి. టీడీపీ కటౌట్‌, మిగిలిన జెండాలను తొలగించకుండా వదిలేయడంలో ఆంతర్యమేంటో హైవే అధికారులు స్పష్టం చేయాలని కార్మిక సంఘ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

కార్మిక సంఘాల మనోభావాలు దెబ్బతీశారు

సీఐటీయూ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 20 ఏళ్ల క్రితం ఆవిష్కరించిన జెండాలను ఎలాంటి సమాచారం లేకుండా తొలగించి తమ మనోభావాలు దెబ్బతీశారని ఆయా సంఘాల నాయకులు మండిపడ్డారు. శ్రీతొలగించిన జెండాలను గురువారం ఉదయం అక్కడే మళ్లీ ఏర్పాటు చేసి ఆవిష్కరిస్తామశ్రీని స్పష్టం చేశారు. ఎవరైనా అడ్డుకుంటే ఆందోళనకు దిగుతామని కార్మిక సంఘాల నాయకులు అన్వర్‌, రోశయ్య, సిద్దారెడ్డి, గుర్రప్ప, ఖాజావళి, కొత్తూరు తదితరులు హెచ్చరించారు.

ఆవిష్కరించిన కొద్దిసేపటికే

హైవే అధికారుల అత్యుత్సాహం

పక్కనే 20 ఏళ్ల నుంచి ఉన్న కార్మిక

సంఘాల నాలుగు జెండాల తొలగింపు

టీడీపీ కటౌట్‌, మరికొన్ని జెండాల

జోలికి వెళ్లని వైనం

అక్కడే జెండాలు ఏర్పాటు చేస్తామన్న కార్మిక సంఘాల నాయకులు

దుర్మార్గమైన చర్య

వైఎస్సార్‌ సీపీ జెండాను తొలగించడం దుర్మార్గమైన చర్య. ఎవరి మెప్పో పొందడం కోసం హైవే అధికారులు ఇలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడినట్టుగా ఉంది. మంగళవారం రాత్రి జెండా ఏర్పాటు చేస్తున్న సమయంలో ఓ దళిత ఎంపీటీసీని దుర్భాషలాడారు. ఆ విషయంపై పోలీసుల ఫిర్యాదు చేశాం. హైవే మొత్తం ఇరువైపులా ఆక్రమణలకు గురువుతున్నా పట్టించుకోని అధికారులకు వైఎస్సార్‌ సీపీ జెండా కనిపించే సరికి ఎక్కడా లేని రూల్స్‌, ఉద్యోగ బాధ్యతలు గుర్తుకొచ్చాయా. టీడీపీ కటౌట్‌ ఎందుకు తొలగించలేదు. ఎల్లకాలం ఒకే ప్రభుత్వం ఉండదని గుర్తుంచుకుంటే మంచిది.

– నెమలిదిన్నె చెన్నారెడ్డి, మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌, కంభం

No comments yet. Be the first to comment!
Add a comment
వైఎస్సార్‌ సీపీ జెండా దిమ్మె కూల్చివేత 1
1/2

వైఎస్సార్‌ సీపీ జెండా దిమ్మె కూల్చివేత

వైఎస్సార్‌ సీపీ జెండా దిమ్మె కూల్చివేత 2
2/2

వైఎస్సార్‌ సీపీ జెండా దిమ్మె కూల్చివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement