చింతిస్తున్నాం.. మన్నించండి!
పొన్నలూరు: పొన్నలూరు మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన పిల్లి మంగమ్మ 12 ఏళ్లుగా వితంతు పింఛన్ తీసుకుంటోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కూడా ఎలాంటి ఆటంకం లేకుండా వలంటీర్లు ప్రతి నెలా ఇంటికి పింఛను నగదు అందించేవారు. అయితే ఈ నెలలో మంగమ్మకు వేలిముద్రలు, ఐరిస్ పడలేదంటూ స్థానిక సచివాలయ వెటర్నరీ అసిస్టెంట్ పింఛను నగదు ఇవ్వలేదు. ఆర్‌బీఐఎస్ పద్ధతిలో వెల్ఫేర్ అసిస్టెంట్ పింఛను ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ పట్టించుకోలేదు. దీంతో మనోవేదనకు గురైన మంగమ్మ గురువారం ప్రాణాలు విడిచింది. ఈ విషయమై శుక్రవారం ‘పింఛన్ రాలేదన్న ఆందోళనతో ప్రాణాలు విడిచింది’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. మంగమ్మ గృహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలని వెటర్నరీ అసిస్టెంట్ నారాయణ, వెల్ఫేర్ అసిస్టెంట్ హరిని ఆదేశించారు. దీంతో వీరిద్దరూ శుక్రవారం కొత్తపాలెంలోని మంగమ్మ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. జరిగిన పొరపాటుకు చింతిస్తున్నామని, తమను మన్నించాలని కోరారు. కాగా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని పంచాయతీ కార్యదర్శి సుబ్రహ్మణ్యం చెప్పారు.
గ్రంథాలయ ఉద్యోగుల సంఘ నూతన కమిటీ ఎంపిక
ఒంగోలు టౌన్: జిల్లా గ్రంథాలయ ఉద్యోగుల సంఘ నూతన కమిటీని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించిన నూతన కమిటీ ఎన్నికల్లో అధ్యక్షునిగా కె.శ్రీధర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కె.సంజయ్‌బాబు, ఉపాధ్యక్షునిగా బి.శేఖర్, సహాయ కార్యదర్శిగా సీహెచ్ అజయ్‌బాబు, కోశాధికారిగా వెంకటేశ్వర్లు, సభ్యులుగా డి.సందీప్, జి.రామాంజి నాయక్, రోహిణి, అనిల్ ఎంపికయ్యారు. ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎండీ జుల్ఫీకర్ అలీ పరిశీలించగా, ఎన్నికల నిర్వహణాధికారిగా పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంఘ ఉపాధ్యక్షుడు పామర్తి రంగారావు వ్యవహరించారు.
మృతి చెందిన పింఛనుదారు కుటుంబానికి ఉద్యోగుల పరామర్శ
చింతిస్తున్నాం.. మన్నించండి!
చింతిస్తున్నాం.. మన్నించండి!
Comments
Please login to add a commentAdd a comment