చైన్‌స్నాచర్ అరెస్టు
● 30 గ్రాముల బంగారు సరుడు రికవరీ
● పలువురు సిబ్బందికి రివార్డులు
అందజేసిన సీఐ
కంభం: మహిళ మెడలో గొలుసు అపహరించిన నిందితుడిని కంభం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వివరాలను కంభం సీఐ కె.మల్లికార్జున శుక్రవారం సాయంత్రం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విలేకరులకు వెల్లడించారు. ఈ నెల 11వ తేదీ ఉదయం రైల్వే స్టేషన్ సమీపంలో నివాసం ఉంటున్న మందా హుస్సేనమ్మ నడుచుకుంటూ ఇంటికి వెళ్తుండగా నెహ్రూనగర్ 6వ లైను సమీపంలో ఆమె మెడలోని బంగారు సరుడును ఓ యువకుడు లాక్కుని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముండ్లపాడుకు చెందిన షేక్ సలీంను నిందితుడిగా గుర్తించారు. గురువారం సాయంత్రం రావిపాడు రోడ్డులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బెట్టింగ్‌లు, ఇతర చెడు వ్యసనాలకు బానిసైన సలీం డబ్బు కోసం దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో అంగీకరించాడు. నిందితుడి నుంచి 30 గ్రాముల బంగారు సరుడు, తాళిబొట్టు స్వాధీనం చేసుకున్నామని, దాని విలువ రూ.2,40,000 ఉంటుందని సీఐ వివరించారు. కాగా దొంగను అరెస్టు చేసేందుకు కృషి చేసిన కానిస్టేబుళ్లు బషీర్, రమేష్, మహబూబ్ సుభాని, పీరయ్య, శివ, హోంగార్డ్ ఖాదర్‌ను ఎస్పీ అభినందించారు. ఆయన సూచన మేరకు సీఐ రివార్డులు అందజేశారు.
విచారణకు హాజరుకాని నాయక్
ఒంగోలు టౌన్: మాజీ పార్లమెంట్ సభ్యుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజు కస్టోడియల్ విచారణపై నమోదైన కేసులో విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఒంగోలు ఎస్పీ ఏఆర్ దామోదర్‌ను విచారణాధికారిగా నియమించిన తర్వాత ఏసీబీ ఏఎస్పీ విజయపాల్, గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము బంధువు తులసిబాబును అరెస్టు చేశారు. ఈ క్రమంలో బీహార్ కేడర్ ఐపీఎస్ అధికారి సునిల్ నాయక్‌ను విచారణకు హాజరు కావాలని జనవరి 3న పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయన స్పందించకపోవడంతో ఈ నెల 14 నుంచి 22వ తేదీలోగా విచారణకు హాజరుకావాలని రెండోసారి నోటీసులు పంపారు. శుక్రవారం ఆయన విచారణకు వస్తారేమోనని పోలీసులు ఎదురుచూశారు. 22వ తేదీ వరకు గడువు ఉన్న నేపథ్యంలో వేచి చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment