భక్తి పరవశం.. శ్రీవారి బ్రహ్మోత్సవం
కొనకనమిట్ల: జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రం వెలుగొండ వెంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో వైభవంగా సాగుతున్నాయి. శుక్రవారం స్వామి, అమ్మవార్ల మూలవిగ్రహమూర్తులను పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ వేదపండితులు ప్రసాదాచార్యులు, వెంకట రమణాచార్యలు, దేవులపల్లి రామపవన్‌కుమార్‌శర్మ పూజలు నిర్వహించారు. అనంతరం ఉభయదాతలు పోలంరాజు కొండలరావు సన్స్, ఆలయ కమిటీ ఈఓ చెన్నకేశవరెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు కాశిరెడ్డి పర్యవేక్షణలో ధ్వజారోహణ కార్యక్రమం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సాగింది. ఈ సందర్భంగా ఆలయ ఈఓ మాట్లాడుతూ.. శనివారం తెల్లవారు జామున శ్రీవారి కల్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment