కమనీయంగా లక్ష్మీనృసింహస్వామి కల్యాణం
మర్రిపూడి: పృథులగిరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి లక్ష్మీనృసింహస్వామి, రాజ్యలక్ష్మి అమ్మవారి కల్యాణం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండువగా సాగింది. అర్చకులు నారాయణం ఆదిశేషాచార్యులు, నారాయణం మారుతీచార్యులు, నారాయణం శ్రీనివాసాచార్యులు, నారాయణం తిరుమలాచార్యులు, వేంకటసాయిచార్యులు కల్యాణ ఘట్టాన్ని శాస్త్రోకంగా నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు హాజరై కల్యాణాన్ని తిలకించి, మొక్కులు చెల్లించారు. ముందుగా స్వామివారి గజోత్సవం మాఢ వీధుల్లో వేడుకగా సాగింది. బరూరి లక్ష్మీనృసింహశాస్త్రి, బరూరి మాణిక్యశాస్త్రి కుటుంబ సభ్యులు ఉభయదాతలుగా వ్యహరించారు. కాగా లక్ష్మీనృసింహస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.7,13,568 వచ్చినట్లు ఈఓ నర్రా నారాయణరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ కుప్పం కొల్లారావు పేర్కొన్నారు.
కమనీయంగా లక్ష్మీనృసింహస్వామి కల్యాణం
Comments
Please login to add a commentAdd a comment