
సత్తా చాటిన రాచర్ల మండలం ఎడ్లు
గిద్దలూరు రూరల్: మండలంలోని నరవ గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి తిరునాళ్ల సందర్భంగా శనివారం నిర్వహించిన జాతీయ స్థాయి రెండు పండ్ల ఎడ్ల పోటీల్లో గిద్దలూరు నియోజకవర్గం రాచర్ల మండలానికి చెందిన ఎడ్లు సత్తా చాటి ప్రథమ స్థానంలో నిలిచాయి. రాచర్ల మండలం ఆకవీడుకు చెందిన విజయలక్ష్మీ నాయుడు ఎడ్లు 4104 అడుగులు లాగి మొదటి బహుమతి కింద రూ.25 వేలు, గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామానికి చెందిన కంచర్ల తనిష్‌కుమార్ ఎడ్లు 3779 అడుగులు లాగి రెండో బహుమతి రూ.20 వేలను దక్కించుకున్నాయి. వైఎస్సార్ జిల్లా కాశినాయన మండలం వెంకట చైతన్యకుమార్ ఎడ్లు 3739 అడుగులు లాగి మూడో బహుమతి రూ.15 వేలు, రాచర్ల మండలం ఆకవీడుకు చెందిన విజయలక్ష్మీనాయుడు ఎడ్లు 3721 అడుగులు లాగి నాల్గవ బహుమతి రూ.10 వేలు, గిద్దలూరు మండలం బురుజుపల్లెకు చెందిన బాలవెంకటరెడ్డి ఎడ్లు 3660 అడుగులు లాగి ఐదో బహుమతి రూ.7 వేలు, నంద్యాల జిల్లా సింగవరం గ్రామానికి చెందిన జమాల్‌బాష ఎడ్లు 3642 అడుగులు దూరం లాగి ఆరో బహుమతి రూ.5 వేలను, నంద్యాలకు చెందిన జయమ్మ ఎడ్లు 3375 అడుగుల దూరంలాగి 7 వ బహుమతి రూ.3 వేలను దక్కించుకున్నాయి. ఈ పోటీల్లో మొత్తం 26 జతల ఎడ్లు పాల్గొన్నాయి. ఎడ్ల పోటీలను తిలకించేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 16 వ తేదిన సీనియర్ విభాగం ఎడ్లకు పోటీలు నిర్వహించననున్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచి బండి శ్రీనివాసులు, వైఎస్సార్ సీపీ నాయకులు పాండురంగారెడ్డి, వెంకటస్వామి, నిర్వాహకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment