టీచర్ సస్పెన్షన్.. హెచ్‌ఎంకు షోకాజ్
కనిగిరి రూరల్: కనిగిరిలోని ఓ పాఠశాలలో బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీచర్ డి.వెంకట రంగారెడ్డిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సమస్యను చట్టపరిధిలో పరిష్కరిస్తామని చెప్పారు. రాస్తారోకో చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన వారిపై, అలాగే ఉపాధ్యాయుల విధులకు ఆటంకం కలిగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
టీచర్‌పై వేటు..
లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన టీచర్ రంగారెడ్డిని సస్పెండ్ చేసినట్లు డీఈఓ కిరణ్ కుమార్ విలేకర్లకు తెలిపారు. అలాగే సమస్య బయటపడి పది రోజులైనా నిర్లక్ష్యంగా వ్యహరించిన హెచ్‌ఎం విజయలక్ష్మికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. కాగా బాలికలతో అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
స్కూల్ వద్ద ఆందోళన
టీచర్ అసభ్యకర ప్రవర్తనపై పది రోజుల క్రితమే బాలికలు ఫిర్యాదు చేసినా హెచ్‌ఎం నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ తల్లిదండ్రులు, బంధువులు బుధవారం పాఠశాల వద్ద ఆందోళన చేశారు. ముస్లిం మహిళలు పెద్ద సంఖ్యలో వెళ్లి హెచ్‌ఎంను నిలదీస్తున్న క్రమంలో వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసు సిబ్బందితో కలిసి పాఠశాల వద్దకు చేరుకున్న ఇన్‌చార్జి సీఐ భీమానాయక్.. ఆందోళనకారులకు సర్దిచెప్పి పంపారు.
లైంగిక వేధింపుల కేసులో టీచర్‌కు రిమాండ్ చట్టాన్ని అతిక్రమించొద్దని కనిగిరి డీఎస్పీ సూచన స్కూల్ వద్ద హెచ్‌ఎంతో బాలికల బంధువుల వాగ్వివాదం సర్దిచెప్పి పంపించిన పోలీసులు
టీచర్ సస్పెన్షన్.. హెచ్‌ఎంకు షోకాజ్
Comments
Please login to add a commentAdd a comment