
లారీ ఢీకొని ఒక వ్యక్తి, ఐదు గొర్రెలు మృతి
● మరొకరికి తీవ్రగాయాలు
పుల్లలచెరువు: జీవాలను మేపుకుంటున్న వ్యక్తిని లారీ ఢీకొనడంతో అతనితో పాటు ఐదు గొర్రెలు మృతి చెందాయి. పుల్లలచెరువు మండలంలోని నరజాములతండాకు చెందిన పి.రాములునాయక్ (45) తనకున్న జీవాలను మేపుకుంటూ శనివారం తెల్లవారుజామున 565వ నంబర్ జాతీయ రహదారిపై మల్లాపాలెం వద్దకు వచ్చాడు. ఆ సమయంలో మాచర్ల నుంచి యర్రగొండపాలెం వస్తున్న లారీ గొర్రెల మందపైగా దూసుకుపోవడంతో ఐదు గొర్రెలతో పాటు రాములునాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. రాములునాయక్‌కు ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నారు. పిల్లలిద్దరూ దివ్యాంగులు కాగా, బంధువులతో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని భోరున విలపించారు. వారి ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. మృతిచెందిన గొర్రెల విలువ దాదాపు రూ.1.50 లక్షలు విలువ ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సంపత్‌కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

లారీ ఢీకొని ఒక వ్యక్తి, ఐదు గొర్రెలు మృతి
Comments
Please login to add a commentAdd a comment