మా వాళ్లే మట్టి దొంగలు..! | - | Sakshi
Sakshi News home page

మా వాళ్లే మట్టి దొంగలు..!

Published Mon, Mar 17 2025 10:49 AM | Last Updated on Mon, Mar 17 2025 10:42 AM

మా వా

మా వాళ్లే మట్టి దొంగలు..!

దర్శి(ముండ్లమూరు):

‘ఇష్టం వచ్చినట్లు మట్టిని తవ్వేస్తున్నారు. రేయింబవళ్లు సాగిస్తున్న తవ్వకాలతో ఇప్పటి వరకు కోట్లాది రూపాయల మట్టిని దోచుకెళ్లారు.’ ఇదంతా అన్నది ఎవరో కాదు. సాక్షాత్తు టీడీపీ యువకులే. సొంత పార్టీ నేతల దోపీడికి తామే బలవుతున్నామంటూ మీడియా ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం అండగా టీడీపీ నేతలు సాగిస్తున్న మట్టి దోపిడీకి పక్క పొలాల వారు నీటి పారుదల లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా ఏం తెలియనట్లు నటిస్తున్నారని పేర్కొన్నారు.

రేయింబవళ్లు దోచేస్తున్నారు..

ముండ్లమూరు మండలం పోలవరంలో 90 ఎకరాల చెరువు ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ చెరువుపై ఆ పార్టీ నేతల కన్ను పడింది. రేయింబవళ్లు పొక్లెయిన్లతో మట్టిని తవ్వేస్తున్నారు. అయితే ఈ మట్టి తవ్వకాలతో సొంత పార్టీలోని వారికే ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో మట్టి తోలేందుకు వచ్చిన టిప్పర్లను, మట్టి ఎత్తుతున్న పొక్లెయిన్లను టీడీపీలోని మరో వర్గం యువకులు అడ్డుకున్నారు. అనంతరం పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫోన్లో ఫిర్యాదు చేయగా..పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చారు. అయితే పై నుంచి ఫోన్లు రావడంతో వాళ్లు ఏం చేయకుండా వెనుదిరిగారు. దీనిపై యువకులు ఆగ్రహంవ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు వాదులాడుకున్నాయి. రేషన్‌ బియ్యం అక్రమంగా తరలిస్తుంటే మీరేం చేస్తున్నారని, ఎందుకు అడ్డుకోవడం లేదని మట్టిని తరలించే నేతలు ప్రశ్నించారు. ఈ సందర్భంంగా గ్రామానికి చెందిన టీడీపీ యువకులు కిలారి సుమన్‌, కొర్రపాటి కోటేశ్వరరావు, మాజీ సర్పంచ్‌ కుమారుడు మాలెంపాటి జితేంద్ర, పరుచూరి గోవర్ధన్‌, కొర్రపాటి అనీల్‌ , మాలెం పాటి భార్గవ్‌ , మాలెంపాటి హేమంత్‌ తదితరులు మాట్లాడుతూ తామంతా హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేసుకుంటున్నామని, ఇష్టం వచ్చినట్లు మట్టి తవ్వకాలతో పొలాలన్నీ బీడులుగా మారుతున్నాయని, దీంతో గ్రామానికి వచ్చి తవ్వడకాలను అడ్డుకున్నామని తెలిపారు.

ఇష్టం వచ్చినట్లు తవ్వకాలతో పొలాలకు

నీటిపారుదల ఆగింది

10 రోజుల్లోనే 10 అడుగుల మేర తవ్వకాలు

రేయింబవళ్లు తవ్వకాలతో వేలాది టిప్పర

మట్టి తరలింపు

గ్రామాన్ని నాశనం చేస్తున్నారని

టీడీపీ యువకుల ఆవేదన

ఈ తతంగం అంతా మాజీ ఎంపీపీ

కనుసన్నల్లోనే

ఫిర్యాదు చేసినా రెవెన్యూ, పోలీస్‌, మైనింగ్‌

అధికారులు పట్టించుకోవడం లేదని

గ్రామస్తుల గగ్గోలు

అధికారంలోకి ఉంటే అంతే..

2014 టీడీపీ అధికారంలోకి ఉన్న సమయంలోనూ ముండ్లమూరు మాజీ ఎంపీపీ మందలపు వెంకట్రావు ఇక్కడ వాగులు, పొలాల్లో ఇసుకను అక్రమంగా తరలించి బోర్లలో నీరు లేకుండా చేశారని చెప్పారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పరిస్థితి లేదన్నారు. కానీ మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమంగా ఇసుక, మట్టి తవ్వకాలు చేస్తున్నారని వాపోయారు. చెరువులో మట్టిని తరలించి నీటి పారుదల లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పది అడుగుల లోతున మట్టి తీసి వేలాది టిప్పర్లు తరలిస్తుంటే ఫిర్యాదు చేసినా పోలీసులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ ఇటువైపు కన్నెత్తి చూడటం లేదని వాపోయారు. ఈ ఏడాది పంటలు పండటం అంతంత మాత్రమేనని, ఇప్పుడు చెరువులో మట్టి తీసి నీరులేకుండా చేస్తే పంటలు ఎలా పండించుకోవాలని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే నీరు పారే పరిస్థితులు లేక చెరువు పక్కపొలాలు మోటార్లు, ఇంజన్లు ద్వారా నీటి సరఫరా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. తామంతా హైదరాబాద్‌ నుంచి వచ్చి తవ్వకాలు అడ్డుకున్నామని, మేం ఉద్యోగాలకు వెళితే మళ్లీ తవ్వకాలు చేసి మా పొలాలను గుల్ల చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ, పోలీస్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా ఏమాత్రం పట్టించుకోవడం లేదని చెప్పారు. ఈ విషయమై తహసీల్దార్‌ లక్ష్మీ నారాయణను వివరణ కోరగా..ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్నారు. చెరువులో మట్టి తీసేందుకు ఎలాంటి అనుమతులు లేవన్నారు. మట్టితీసిన పొక్లెయిన్‌లు, టిప్పర్ల ఫొటోలు ఇచ్చినా వాటిని సీజ్‌ చేస్తామని వివరణ ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
మా వాళ్లే మట్టి దొంగలు..! 1
1/2

మా వాళ్లే మట్టి దొంగలు..!

మా వాళ్లే మట్టి దొంగలు..! 2
2/2

మా వాళ్లే మట్టి దొంగలు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement