నీకన్నా పెద్ద యాక్టర్ లేరు బాలినేనీ..
● వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే
బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి
ఒంగోలు సిటీ: బాలినేని శ్రీనివాసరెడ్డి కన్నా పెద్ద యాక్టర్ ఎవరూ లేరు. ఆయన పెద్ద కమల్ హాసన్..ముందు ఆయనతోనే సినిమా చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఎద్దేవా చేశారు. జనసేన ఆవిర్భావ సభలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలపై బూచేపల్లి మండిపడ్డారు. ఆమేరకు ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘‘అయ్యా .. బాలినే ని నిన్ను టీడీపీలో చేర్చుకోకుండా తిరస్కరించేసరికి నీ అవసరం కోసం, రాజకీయ లబ్ధి కోసం జనసేనపార్టీలో చేరావు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి లేకపోతే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రాజకీయం లేదని, సీఎం కాలేడ ని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి 2009లో చనిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది 2011లో... ఇన్ని సంవత్సరాలు జనాలతో కలిసి కార్యకర్తలకు అండగా ఉండి పార్టీ స్థాపించి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెక్కల కష్టంతో ప్రజలు, కార్యకర్తల మద్దతుతో వైఎస్సార్ ఆశీస్సులు, ఆశయాలతో 2019 లో సీఎం అయ్యారు. మళ్లీ జగన్ సీఎం కాలేడని చెబుతున్నావు.. మీతాతలు, ముత్తాతలు దిగి వచ్చినా 2029లో జగన్ సీఎం కావడం తథ్యం. వైఎస్ జగన్ మీకు డబ్బులు ఇవ్వాలి, మీ కుటుంబ డబ్బులు కొట్టేశారని చెబుతున్నారు.. బాలినేనీ..ప్రకాశంలో జిల్లాలో కార్యకర్తలు, నాయకులు, పాత ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌ల నుంచి నువ్వు దోచినట్లు ఎవ్వరూ దోచుకోలేదు. బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ నుంచి బయటకు పోయినప్పటి నుంచి జిల్లాలో పార్టీ చాలా సంతోషంగా, ప్రశాంతంగా ఉంది. మాకు పీడ విరిగిపోయిందని అనుకుంటున్నారు. అవసరమైతే జెడ్పీ చైర్‌పర్సన్‌ను దించేస్తామని అంటున్నావు..నీలాగా జెడ్పీటీసీలు అవకాశవాదం కోసం రాజకీయాలు చేసేవారు కాదు. పార్టీ మారేవారు ఎవరూ లేరు. ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌ను ఎవరూ ఏమీ చేయలేరు. బాలినేని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి అతని రాజకీయాల కోసం ఎమ్మెల్సీ అవుతాను, మినిస్టర్ అవుతానని కల్లబొల్లిమాటలు చెబుతున్నారు. అయ్యా పవన్‌కళ్యాణ్ ఒకటే గుర్తుపెట్టుకోండి బాలినేనికన్నా అవకాశవాది ఎవరూ లేరు, అతను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాశనం అవుతుంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మద్దతుతో జిల్లాలో ప్రతి కార్యకర్తకు అండగా ఉండి పార్టీని పటిష్టం చేయడం కోసం కృషి చేస్తాను’’ అని బూచేపల్లి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment