ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా చర్యలు
పదో తరగతి విద్యా ర్థులు పరీక్షలు ప్రశాంత వాతావరణంలో రాసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా రాయాలి. ఎక్కడైనా మాస్‌కాపీయింగ్‌కు పాల్పడితే అటువంటి వారిపై చర్యలు తీసుకుంటాం.
– అత్తోట కిరణ్‌కుమార్, డీఈఓ, ఒంగోలు
పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట భద్రత
● ఎస్పీ ఏఆర్ దామోదర్
ఒంగోలు టౌన్: పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పరీక్షలు సజావుగా, ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన అన్నీ రకాల చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు, స్మార్ట్ వాచీలు, మొబైల్ ఫోన్లు, ఐపాడ్‌లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద ఇన్విజిలేటర్లు, సిబ్బంది తప్ప ఇతరులు ఎవరూ ఉండరాదన్నారు. విద్యార్థులు మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడినా, వారిని ప్రోత్సహించినా నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్ష పత్రాలను భద్రపరిచే స్ట్రాంగ్ రూంల వద్ద పోలీసు సిబ్బందితో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. పరీక్ష కేంద్రాలకు ప్రశ్న పత్రాలు తీసుకొని వెళ్లే సమయంలో, జవాబు పత్రాలను తీసుకొని వచ్చే సమయంలో పోలీసు బందోబస్తు ఉంటుందని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లను మూసి వేయిస్తున్నట్లు తెలిపారు. పరీక్షల సమయంలో ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే సహాయం చేయడానికి పోలీసు శాఖ ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మొబైల్ పెట్రోలింగ్‌ను ఏర్పాటు చేశామన్నారు. అత్యవసర పరిస్థితుల ఎదురైతే పోలీసు సహాయం కోసం వెంటనే 100, 112, 9121102266కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా చర్యలు
Comments
Please login to add a commentAdd a comment