
నడి రోడ్డులో విద్యుత్ టవర్
సీసీ రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసిన హెచ్‌టీ విద్యుత్ టవర్
● ఇడుపూరు–1 పునరావాస కాలనీలో కాంట్రాక్టర్ నిర్వాకం
మార్కాపురం: పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపునకు గురవుతున్న కలనూతల గ్రామస్తులు మార్కాపురం సమీపంలోని ఇడుపూరు–1 పునరావాస కాలనీలో ఉంటున్నారు. ఈ గ్రామంలో విద్యుత్ హెచ్‌టీ టవర్‌ను సంబంధిత కాంట్రాక్టర్ నడి రోడ్డుపై ఏర్పాటు చేసి తన నిర్వాకాన్ని చాటుకున్నాడు. గ్రామస్తులు ఎలా రాకపోకలు సాగిస్తారనే ఆలోచన కూడా లేకుండా హెచ్‌టీ లైన్ టవర్ ఏర్పాటు చేయడాన్ని చూసిన ప్రజలు ఇదెక్కడి విడ్డూరమంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రోడ్డు మధ్యలో ఉన్న హెచ్‌టీ విద్యుత్ టవర్‌ను పక్కన ఏర్పాటు చేయాలని కలనూతలవాసులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment