వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన దద్దాల
కనిగిరిరూరల్: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని పార్టీ కనిగిరి ఇన్‌చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం కలిశారు. పార్టీ ఒంగోలు పార్లమెంట్ ఇన్‌చార్జి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివ ప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మతో కలిసి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దద్దాల నారాయణయాదవ్ నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితులతో పాటు, కూటమి ప్రభుత్వం నేతలు అకారణంగా కనిగిరిలో ముగ్గురు సర్పంచ్‌ల చెక్ పవర్‌లను రద్దు చేసి ఇబ్బందులు పెడుతున్న విషయాన్ని జగన్‌మోహన్‌రెడ్డికి వివరించారు. లింగంకుంట్ల సర్పంచ్ నాగరత్తాలు తన చెక్ పవర్ రద్దు చేసిన విషయాన్ని విన్నవించారు. అన్ని విధాలా అండగా ఉంటామని జగనన్న భరోసా ఇచ్చినట్లు దద్దాల నారాయణ తెలిపారు. ఎంపీపీ గాయం సావిత్రి, మాజీ ఎంపీపీలు గాయం బలరాంరెడ్డి, గాయం ఈశ్వరమ్మ, పార్టీ మండల అధ్యక్షుడు యక్కంటి శ్రీనివాసులరెడ్డి, మద్ది తిరుపతయ్య, సర్పంచ్‌లు నాగరత్తాలు, సానికొమ్ము మధుసూదన్‌రెడ్డి, దిరిశనం పిచ్చిరెడ్డి, యారవ వెంకటరెడ్డి, సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి, చిట్యాల నాగార్జునరెడ్డి, మోరా అంజనేయ రెడ్డి, మోరా సాంబ, శ్యామల సాంబిరెడ్డి, మద్ది శ్రీకాంత్ సైకం స్వర్ణ ఏడుకొండలు రెడ్డి, పాశం కొండయ్య, ఇండ్ల శ్రీకాంత్, ఈర్ల శ్రీను, కంటు కేశవ, షబ్బీర్, పెద్ద ఖాజా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment