
ఎల్లారెడ్డిపేటలో పోలీసుల తనిఖీలు
● నంబర్ ప్లేట్‌లేని వాహనాలపై ప్రయాణిస్తే చర్యలు.. ● డీఎస్పీ విశ్వప్రసాద్ ● 12 వాహనాలు సీజ్
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): నంబర్ ప్లేట్‌లేని వాహనాలపై ప్రయాణిస్తే వాహనాలను సీజ్‌చేసి కేసులు నమోదు చేస్తామని సిరిసిల్ల డీఎస్పీ విశ్వప్రసాద్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలకేంద్రంలో మంగళవారం రాత్రి డీఎస్పీ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టారు. నంబర్ ప్లేట్‌లేని 12 వాహనాలను సీజ్‌చేశారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న నలుగురిపై కేసు నమోదుచేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. అపరిచిత వ్యక్తు లు గుర్తుతెలియని వాహనాలపై ప్రయాణిస్తే సమా చారం అందించాలన్నారు. తనిఖీల్లో సీఐ మొగిలి, ఎస్సై శేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment