మత్తుపదార్థాలను నియంత్రించాలి
● కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా
సిరిసిల్లకల్చరల్: మత్తుపదార్థాలను నియంత్రించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. ఎస్పీ అఖిల్‌మహాజన్‌తో కలిసి నార్కో సమన్వయ సమావేశాన్ని బుధవారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. డ్రగ్స్ వినియోగంతో వచ్చే అరిష్టాలను విస్తృతంగా ప్రచారం చేస్తూనే గంజాయి సాగు నివారణచర్యలు, నమోదవుతున్న కేసుల గురించి చర్చించారు. విద్యాసంస్థల్లో డ్రగ్స్ వినియోగం, గంజాయి నివారణపై వ్యాసరచన పోటీలు నిర్వహించాలన్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ డ్రగ్స్, గుడుంబా, గంజాయిసాగు సమాచారాన్ని 87126 56426 నంబర్‌లో తెలపాలని కోరారు. ఆర్డీవో వెంకట ఉపేందర్‌రెడ్డి, ఇన్‌చార్జి డీపీవో శేషాద్రి, డీఏవో అఫ్జలీ బేగం, డీఐఈవో శ్రీనివాస్, ఎకై ్సజ్ అధికారి సామల పంచాక్షరి పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల సర్వే పూర్తి చేయాలి
నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే పూర్తిచేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం 1,07,398 మంది ఆశావహులు ఉన్నారన్నారు. వీటిలో 15,510 దరఖాస్తులను ఇందిరమ్మ యాప్‌లో నిక్షిప్తం చేశామని తెలిపారు. నిత్యం 25 ఇళ్ల చొప్పున ఈనెల 31లోపు సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. ఇన్‌చార్జి డీపీవో శేషాద్రి, ఎంపీడీవోలు, పంచాయతీకార్యదర్శులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment