కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచాలి
● జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం
సిరిసిల్ల: అంగన్‌వాడీ కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచుతూ.. పిల్లలకు పౌష్ఠికాహారం అందించాలని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం కోరారు. సిరిసిల్ల మండల పరిధిలోని అంగన్‌వాడీ ఆయాలతో బుధవారం సమావేశమయ్యారు. కేంద్రాలకు వచ్చే పిల్లలను ఆయాలు శ్రద్ధగా చూసుకోవాలని, గర్భిణులు, బాలింతలకు రుచికరమైన వంటలు పెట్టాలని కోరారు. పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించాలని సూచించారు. సీడీపీవో ఉమారాణి, సఖీ జిల్లా కోఆర్డినేటర్ రోజా, సెక్టార్ సూపర్‌వైజర్లు దివ్య, సుస్మిత పాల్గొన్నారు.
బీడీ కార్మికులపై సర్కార్ శీతకన్ను
సిరిసిల్లటౌన్: అధికారం చేపట్టి ఏడాది గడుస్తున్నా కాంగ్రెస్ సర్కారు బీడీ కార్మికులపై శీతకన్ను వీడ డం లేదని బీడీవర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు మూశం రమేశ్ కోరారు. సిరిసిల్లలోని పార్టీ ఆఫీసులో బుధవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రూ.4వేల పెన్షన్ సాధన, వెయ్యి బీడీలకు రూ.500 కూలీ కోసం పోరాటానికి సిద్ధం కావాలన్నారు. నాయకులు సూరం పద్మ, దాసరి రూప, బెజిగం సురేశ్, జిందం కమలాకర్, రైసా బేగం, సబ్బని శాంతమ్మ, కొక్కుల యశోద, బోడ శోభ, పద్మ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment