మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
సిరిసిల్ల: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం కోరారు. కలెక్టరేట్‌లో గురువారం మహిళ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. లక్ష్మీరాజం మాట్లాడుతూ మహిళలకు సమానమైన హక్కులతోపాటు ప్రత్యేకమైన చట్టాలను కూడా ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. గృహహింస నిరోధక చట్టం, పనిప్రదేశాల్లో లైంగిక వేధింపుల నివారణ చట్టం, నిర్భయచట్టం అమలు చేస్తున్న విషయాన్ని వివరించారు. ఏ సందర్భంలోనైనా లైంగిక, మానసిక, శారీరక, ఆర్థిక వేధింపులను ఎదుర్కొంటే టోల్‌ఫ్రీ నంబర్ 181 ద్వారా వైద్యం, న్యాయం, పోలీస్ కౌన్సెలింగ్, షెల్టర్ సహాయాలు కోరవచ్చని వివరించారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ నిర్మలదేవి, మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ రోజా, సఖీ ఇన్‌చార్జి విజయ, సిరిసిల్ల ఆర్డీవో రాధాబాయ్, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, మిషన్ భగీరథ ఈఈ జానకి, గెజిటెడ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సమరసేన, జిల్లా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, డీఆర్‌డీవో శేషాద్రి, మహిళా అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు సఖీ కేంద్రం ఆధ్వర్యంలో నర్సింగ్ కాలేజీలో అవగాహన సదస్సు నిర్వహించారు.
● జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం
Comments
Please login to add a commentAdd a comment