దంతవైద్య దినోత్సవం
సిరిసిల్ల: జాతీయ డెంటిస్ట్ డే సందర్భంగా సిరిసిల్లలో గురువారం దంతవైద్యులు ర్యాలీ నిర్వహించారు. సిరిసిల్ల అంబేడ్కర్ సర్కిల్ నుంచి బతుకమ్మ ఘాట్ వరకు 2కే రన్, వాకింగ్ చేశారు. నోటి ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఇండియన్ డెంటిస్ట్ అసోసియేషన్(ఐడీఏ) జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పిన్నా రాజు తెలిపారు. ఐడీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి వైద్యులు ఎస్.సతీశ్‌కుమార్, డి.శ్యాంసుందర్‌రెడ్డి, దంతవైద్యులు విజయ్, రాజేందర్, కె.గోపి, సత్య, అన్వేశ్, సీహెచ్.సంతోష్, పూర్ణచందర్, శివరామకృష్ణ, ఎ.సంతోష్, కీర్తి, ప్రియ, స్నేహ, గీత, ఆకాంక్ష, సంధ్య, రమ్య, లావణ్య, ఎం.రాజేందర్, నరేశ్, శ్రవంతి, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment