పనిచేసే వారికి గుర్తింపు
● బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు అన్నపూర్ణ
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని నారాయణపూర్‌కు చెందిన దుంపెన స్రవంతిని బీజేపీ మహిళా మోర్చా జిల్లా కార్యదర్శిగా నియమిస్తూ జిల్లా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ మాట్లాడుతూ పార్టీలో పనిచేసే ప్రతీ కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు. పార్టీ బలోపేతానికి అందరూ కృషిచేయాలని కోరారు. తన నియామకానికి సహకరించిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు అన్నపూర్ణ, మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డిలకు స్రవంతి కృతజ్ఞతలు తెలిపారు.
అద్దె వాహనానికి దరఖాస్తులు
సిరిసిల్లకల్చరల్: సీ్త్ర, శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలో నిర్వహిస్తున్న బాల రక్షాభవన్ కార్యకలాపాల కోసం అద్దె ప్రాతిపదికన వాహనం కావాలని జిల్లా సంక్షేమ అధికారి పి.లక్ష్మీరాజం ప్రకటనలో కోరారు. ఆసక్తిగల వాహన యజమానులు ఈనెల 18లోపు కలెక్టరేట్‌లోని సంక్షేమాధికారి ఆఫీస్‌లో రూ.2500 డీడీతో ప్రతిపాదనలు అందజేయాలని పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న వాహనాన్ని నడిపేందుకు డ్రైవర్ అవసరం ఉందని డీడబ్ల్యూవో లక్ష్మీరాజం తెలిపారు. ఇంటర్మీడియెట్ విద్యార్హతతోపాటు లైసెన్స్, బ్యాడ్జ్ ఉండాలని పేర్కొన్నారు. ఈనెల 18లోపు దరఖాస్తులను డీడబ్ల్యూవో కార్యాలయంలో అందజేయాలని సూచించారు.
ఉపాధి పనులు తనిఖీ
వీర్నపల్లి(సిరిసిల్ల): మండలకేంద్రంలో జరుగుతున్న ఉపాధిహామీ పనులను డీఆర్డీవో శేషాద్రి, హెచ్‌ఆర్ మేనేజర్ నాగరాజుతో కలిసి గురువారం తనిఖీ చేశారు. వారు కూలీలతో మాట్లాడుతూ... కొలతల ప్రకారం పనులు చేయాలన్నారు. వేసవి దృష్ట్యా ఉదయమే త్వరగా పనులు పూర్తిచేసుకోవాలని సూచించారు. అనంతరం మండల కార్యాలయంలో సాంకేతిక సహాయకులతో సమీక్ష నిర్వహించి కూలీల సంఖ్యను పెంచాలన్నారు. కార్యక్రమంలో ఏపీవో శ్రీహరి, సాంకేతిక సహాయకులు అనిత, గంగాధర్, ఫీల్డ్ అసిస్టెంట్ రాజు తదితరులు పాల్గొన్నారు.
పనిచేసే వారికి గుర్తింపు
Comments
Please login to add a commentAdd a comment