వేసవిలో జాగ్రత్తలు వివరించాలి
● జిల్లా వైద్యాధికారి రజిత
సిరిసిల్ల: వేసవిలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత కోరారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్‌లో గురువారం పీహెచ్‌సీల వైద్యులతో సమావేశమయ్యారు. డీఎంహెచ్‌వో మాట్లాడు తూ వైద్య, ఆరోగ్యశాఖ లక్ష్యాలను సాధించా లని, వ్యాక్సినేషన్ చేయాలని, ఆస్పత్రిలో ప్రసవాలు, గర్భిణులు, బాలింతల్లో పౌష్టికాహారలోపం లేకుండా చూడాలన్నారు. అవసరమైన మేరకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. వైద్యులు అనిత, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కాల్వపనులు పూర్తి చేయండి
ఇల్లంతకుంట(మానకొండూర్): కాల్వపనులు పూర్తి చేసి ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల రైతులను ఆదుకోవాలని జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు తీపిరెడ్డి తిరుపతిరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గన్నారం నర్సయ్య కోరారు. ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌లో 11 రోజులుగా రైతులు చేస్తున్న రిలేనిరాహార దీక్షలను గురువారం సందర్శించి సంఘీభావం తెలిపారు. వారు మాట్లాడుతూ అసంపూర్తిగా ఉన్న 3 కిలోమీటర్ల కాల్వ పనులు పూర్తి చేస్తే 9,500 ఎకరాలకు నీరు అందుతుందన్నారు.
మున్సిపల్ దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం
సిరిసిల్లటౌన్: సిరిసిల్లలో మున్సిపల్ ఆధ్వర్యంలో స్ట్రీట్ వెండర్స్ కోసం నిర్మించిన దుకాణాల కేటాయింపునకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఎస్.సమ్మయ్య ప్రకటనలో తెలిపారు. పట్టణంలో గుర్తింపు గల వీధివిక్రయదారులు తమ గుర్తింపుకార్డులు, వెండింగ్ ఫొటో, పాస్‌పోర్టు సైజు ఫొటోతో దరఖాస్తులను ఈనెల 20లోపు మెప్మా సెక్షన్‌లో అందించాలని కోరారు. డ్రా పద్ధతిలో దుకాణాలు అందజేయనున్నట్లు తెలిపారు.
21న హుండీల లెక్కింపు
సిరిసిల్లటౌన్: సిరిసిల్లలోని ఆలయాల్లో ఈనెల 21న హుండీల లెక్కింపు చేపడుతున్నట్లు ఈవో మారుతీరావు తెలిపారు. ఈమేరకు గురువారం ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 9.30 గంటలకు పోచమ్మ ఆలయం, ఉదయం 11.30 గంటలకు శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయం, మధ్యాహ్నం 1.30 గంటలకు శ్రీవిశ్వనాథ ఆలయాల్లో హుండీలు లెక్కిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రజా సమస్యలపై పోరాటాలు
ముస్తాబాద్(సిరిసిల్ల): ప్రజాసమస్యల పరిష్కారానికి సీపీఎం రాజీలేని పోరాటాలు చేస్తోందని సీఐటీయూ కన్వీనర్ కోడం రమణ పేర్కొన్నారు. ముస్తాబాద్‌లో గురువారం కరపత్రాలు ఆవిష్కరించి మాట్లాడారు. ఈనెల 16న సిరిసిల్లలో సీపీఎం పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఉందన్నారు. ఈ సమావేశానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ వస్తున్నట్లు తెలిపారు. అన్నల్‌దాస్ గణేశ్, గీస భిక్షపతి, నరేశ్, రమేశ్, దేవయ్య, బాబు, లక్ష్మణ్ పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపిక
వేములవాడఅర్బన్: వేములవాడ మండలం అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల భౌతికశాస్త్ర విభాగం విద్యార్థులు ‘కాంపాక్ట్ డిస్క్ యూజ్ ఏ డిప్రాక్షన్ గ్రేటింగ్’ అనే అంశంపై చేసిన పరిశోధన రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు కళాశాల ప్రిన్సిపాల్ శంకర్ తెలిపారు. పరిశోధనలో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు.
వేసవిలో జాగ్రత్తలు వివరించాలి
వేసవిలో జాగ్రత్తలు వివరించాలి
వేసవిలో జాగ్రత్తలు వివరించాలి
Comments
Please login to add a commentAdd a comment