వందశాతం పన్నులు వసూలు చేయాలి
సిరిసిల్ల: వంద శాతం ఇంటి పన్నులు ఈనెలాఖరులోగా వసూలు చేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్‌లో గురువారం గ్రామపంచాయతీ కార్యదర్శులు, మండల పంచా యతీ అధికారులతో సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి పన్నుల వసూళ్ల లక్ష్యం సాధించాలన్నారు. ఆస్తి పన్ను చెల్లించని వారికి వెంటనే నోటీసులు జారీ చేయాలని, అవసరమైన చోట ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆస్తి పన్నుల విలువ పెంచాలని, రీ అసెస్మెంట్ చేసి వసూలు చేయాలని సూచించారు. సకాలంలో ట్రేడ్‌లైసెన్స్ రెన్యూవల్ జరిగేలా చూడాలని, ట్రేడ్‌లైసెన్స్ లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తే సీజ్ చేయాలన్నారు. మల్టీపర్పస్ సిబ్బంది వేతనాలు పంచాయతీ నిధుల నుంచి చెల్లించాలని తెలిపారు.
పారిశుధ్యంపై దృష్టి సారించాలి
గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల పరిసరాల్లో అపరిశుభ్రత నియంత్రణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. రోడ్లను రెగ్యులర్‌గా శుభ్రం చేయాలని, ప్రతి రోజు ఇళ్ల నుంచి చెత్త సేకరించాలని తెలిపారు. గ్రామాల్లో పెండింగ్ ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు క్లియర్ చేయాలన్నారు. ప్రభుత్వం కల్పించిన 25 శాతం రీబేట్ వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా పంచాయతీ అధికారి షరీఫొద్దీన్, డీఎల్‌పీవో నరేశ్, డీటీసీపీవో అన్సార్, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఎల్‌ఆర్‌ఎస్‌పై అవగాహన కల్పించాలి
కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
Comments
Please login to add a commentAdd a comment