
తాగునీటి సమస్యను పరిష్కరించండి
బండ్లగూడ: హైదర్షాకోట్ శాంతినగర్ కాలనీ రోడ్ నెంబర్–3 వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శుక్రవారం ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కాలనీలో తాగునీటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని, కమ్యూనిటీహాల్ నిర్మాణం కోసం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ..గృహ అవసరాల నీటి కోసం బోర్ల ద్వారా మాత్రమే ఆధారపడి ఉన్నామన్నారు. వేసవి కాలం మొదలవడంతో బోర్లు ఎండిపోతున్నాయన్నారు. జలమండలి అధికారులు నాలుగు రోజులకు ఒకసారి అది కూడా కేవలం ఒక గంట మాత్రమే నీటిని వదులుతున్నారన్నారు. రోజు విడిచి రోజు నీరు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను కోరామన్నారు. ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కె.నాగేష్, ప్రధాన కార్యదర్శి ఏ.వినయ్‌కుమార్‌గౌడ్, కోశాధికారి పి.కోటేశ్వర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు అమర్‌సింగ్, మనోహర్ పాల్గొన్నారు.
వేసవి రాకముందే నీటి కష్టాలు..
వేసవి రాకముందే నీటి కష్టాలు ప్రారంభమైయ్యాయని ఈ సమస్యను పరిష్కరించేందుకు జలమండలి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు రావులకోళ్ల నాగరాజ్ కోరారు. నీటి కటకటపై జలమండలి అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాటత్లాడుతూ..బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మాధవీనగర్ కాలనీ, పీజీ కాలనీ ఇతర కాలనీల వాసులకు నీటి సమస్య తీవ్రంగా ఉండడంతో నీటి దాహార్థిని తీర్చాలని నీటి ఎద్దడి తలెత్తకుండా పరిష్కారం చూపాలన్నారు. హిమాయత్‌సాగర్ నుంచి వాటర్ వస్తాయని ఈ మధ్యనే వాటర్ గ్రిడ్ ప్రారంభోత్సవం చేశారన్నారు. మరి ఎందుకు వాటర్ రావడం లేదన్నారు. గతంలో కేసీఆర్ సర్కార్ మిషన్ భగీరథతో తాగునీటి కష్టాలు తీర్చిందని మండు వేసవిలోనూ నీటి కష్టాలు లేకుండా తాగునీటి కష్టాలు తీర్చిందని గుర్తుచేశారు. మార్చి, ఏప్రిల్, మే నెలలో తమ పరిస్థితి ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. ఇప్పటికై నా జలమండలి అధికారులు స్పందించి వాటర్ సమస్య లేకుండా రోజు విడిచి రోజు నీళ్లు సక్రమంగా విడుదల చేయాలని అధికారులను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment