
కులగణన లెక్కలు వెల్లడించండి
షాద్‌నగర్: ప్రభుత్వం యాదవుల జనాభా గణాంకాలను వెల్లడించాలని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి దామోదర్‌యాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... దేశంలో అగ్రకుల జనాభా అత్యంత తక్కువగా ఉన్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. రాష్ట్ర జనాభాలో యాదవులు అధికశాతం మంది ఉన్నారన్నారు. అయితే ప్రభుత్వం యాదవుల సంఖ్య తక్కువగా ఉందని చూపించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఇటీవల నిర్వహించిన కుటుంబ సర్వే ఫలితాలను కులాల వారీగా వెల్లడించాలని డిమాండ్ చేశారు. జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. బీసీల సంఖ్యను తక్కువగా చూపించి వారి రాజకీయ, విద్య, ఉద్యోగ రిజర్వేషన్లను దెబ్బ తీసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. రిజర్వేషన్ల విషయంలో తమకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. సమావేశంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అంజన్‌యాదవ్, నాయకులు తిరుమలేష్, చెన్నకేశవులు, నర్సింగ్‌యాదవ్, సాయికుమార్ పాల్గొన్నారు.
యాదవ సంఘం రాష్ట్ర కార్యదర్శి దామోదర్‌యాదవ్
Comments
Please login to add a commentAdd a comment