అర్చకుడిపై దాడిని ఖండిస్తున్నాం
మొయినాబాద్ రూరల్: చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంజర్ల ప్రకాశ్ అన్నారు. పలువురు పార్టీ నాయకులతో కలిసి శుక్రవారం వారు వేర్వేరుగా రంగరాజన్‌ను పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, బీజేపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు అంజన్‌కుమార్‌గౌడ్, నాయకులు గోపాల్‌రెడ్డి, మధుసుధన్‌రెడ్డి, శ్రీకాంత్, కిషన్ పాల్గొన్నారు.
విభేదాలు సృష్టించేందుకే..
రాముడి పేరుతో దాడులు చేయడం సిగ్గుచేటని, నిత్యం దైవ సన్నిధిలో ఉండే వారిపై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం సరికాదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. చిలుకూరు బాలాజీని సందర్శించిన అనంతరం ప్రధాన పూజారి రంగరాజన్‌ను కలిసి దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. హిందువుల మధ్య విభేదాలు సృష్టించాలనే ఇలాంటి కుట్రలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. ఇందుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జీ భీమ్‌భరత్, ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి,
ఈటల రాజేందర్, ఎమ్మార్పీ ఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ
రంగరాజన్‌కు నేతల పరామర్శ
Comments
Please login to add a commentAdd a comment