
ప్రజలు తిరగబడటం ఖాయం
● ప్రభుత్వానికి ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి ● బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ● కడ్తాల్‌లో పార్టీ నాయకుల సమావేశం
కడ్తాల్: ప్రభుత్వంపై ప్రజలు తిరగబడటం ఖాయమని, ఆ రోజులు దగ్గర్లోనే ఉన్నాయని, హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ దారుణంగా విఫలమైందని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. మండల కేంద్రంలోని తన నివాసంలో శనివారం బీఆర్‌ఎస్ నియోజకవర్గస్థాయి నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈనెల 18న పార్టీ ఆధ్వర్యంలో ఆమనగల్లులో నిర్వహించనున్న రైతు దీక్షకు సంబంధించిన అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు మాయమాటలు, మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ఆతర్వాత వీటిని విస్మరించిందని మండిపడ్డారు. ప్రభుత్వ అసమర్థ విధానాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుందని విమర్శించారు. చాలా గ్రామాల్లో రైతులకు రుణమాఫీ కాలేదని, రైతు భరోసా అందలేదని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారని స్పష్టంచేశారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి సత్తాచాటాలని పిలుపునిచ్చారు. ఈనెల 18న ఆమనగల్లు పట్టణంలో నిర్వహించనున్న రైతు దీక్షలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారని తెలిపారు. నియోజకవర్గంలోని నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎడ్మ సత్యం, జెడ్పీటీసీ మాజీ సభ్యులు దశరథ్‌నాయక్, అనురాధ, విజితారెడ్డి, మాజీ ఎంపీపీలు నిర్మల, శ్రీనివాస్‌యాదవ్, రాంరెడ్డి, జైపాల్‌నాయక్, మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్, సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పరమేశ్, నాయకులు శంకర్, రాజేందర్‌యాదవ్, రామకృష్ణ, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment