
పదవీ కాలం పొడిగింపుపై హర్షం
ఇబ్రహీంపట్నం రూరల్: సహకార సంఘాలు, డీసీసీబీల పద వీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించడంపై పలువురు నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శనివారం టీజీక్యాబ్ చైర్మన్ మార్నెని రవీందర్‌రావు, వైస్ చైర్మన్ సత్తయ్య, డీసీసీబీ చైర్మన్లు శనివారం పలువురు నేతలను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి, మహబూబ్‌బాద్ ఎంపీ బలరాంనాయక్, డోర్నకల్ శాసన సభ్యులు రామచంద్రనాయక్‌ను కలిసి పుష్పగుచ్చం అందజేసి, శాలువతో సత్కరించారు. వీరిలో డీసీసీబీ చైర్మన్లు రమేష్‌రెడ్డి, దేవెందర్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, భోజారెడ్డి, వెంకటేశ్వరరావు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment