
● నాణ్యత, శుభ్రత పాటించని వారికి భారీగా జరిమానా ● నిబంధ
హోటళ్లలో తనిఖీలు
శంకర్‌పల్లి: ఆహార నాణ్యత పాటించని హోటళ్లు, బేకరీలపై శంకర్‌పల్లి మున్సిపల్ అధికారుల కొరడా ఝులిపించారు. శనివారం పట్టణంలోని పలు హోటళ్లు, బేకరీలలో మున్సిపల్ కమిషనర్ యోగేశ్, పర్యావరణాధికారి ఆనంద్‌తో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పల్లె రుచులు, మసూల్‌దార్ మండి, ఎస్‌వీఆర్ బేకరీలు నాణ్యత పాటించడం లేదని, కిచెన్ నిర్వహణ సైతం సక్రమంగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయా హోటళ్లలో నిల్వ ఉంచిన అన్నం, చికెన్, అల్లం పేస్ట్‌ను గుర్తించారు. అనంతరం మసూల్‌దార్ మండికి రూ.30 వేలు, పల్లె రుచులుకు రూ.5 వేలు, ఎస్‌వీఆర్ బేకరీకి రూ.5 వేలు జరిమానా విధించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రమాణాలు పాటించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment