
కుక్కను తప్పించబోయి.. డివైడర్‌ను ఢీకొట్టి
● ద్విచక్ర వాహనం బోల్తా ● అక్కడికక్కడే వ్యక్తి మృతి
చేవెళ్ల: ముంబై లింక్ హైవేలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి కుక్కను తప్పించబోయి బోల్తా పడ్డాడు. శుక్రవారం రాత్రి చేవెళ్ల దేవునిఎర్రవల్లి బస్టేజీ సమీపంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని ఎన్కేపల్లికి చెందిన బేగరి పాండు (35) వ్యవసాయంతోపాటు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ భార్యాపిల్లలతో కలిసి చేవెళ్లలో నివాసం ఉంటున్నాడు. శుక్రవారం సాయంత్రం స్వగ్రామానికి వెళ్లిన పాండు బైక్‌పై తిరిగి వస్తున్నాడు. దేవునిఎర్రవల్లి స్టేజీ వద్దకు రాగానే అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చిన కుక్కను తప్పించబోయి, బైక్ అదుపు తప్పి, డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడ్డాడు. తలకు బలమైన గాయంతో అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులకు సంఘటన స్థలానికి వెళ్లి, వివరాలు సేకరించారు. మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి శనివారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతునికి భార్య పుష్ప, ఓ కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పుష్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్మాని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment