
కానిస్టేబుల్‌కు సన్మానం
ఇబ్రహీంపట్నం: చెరువులోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ ప్రాణాలు కాపాడిన ఎస్‌డీఆర్‌ఎఫ్ కానిస్టేబుల్ జగదీశ్‌ను మూడో బెటాలియన్ అధికారులు శనివారం సన్మానించి, అభినందనలు తెలిపారు. ఇబ్రహీంట్నానికి చెందిన తాటిపల్లి అంజమ్మ(50) శుక్రవారం రాత్రి స్థానిక పెద్దచెరువులో దూకి కొన ఉపిరితో కొట్టుమిట్టాడుతుండటాన్ని గమనించిన జగదీశ్ వెంటనే చెరువులోకి దూకి ఆమెను రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చాడు. అనంతరం అక్కడున్న తోటి పోలీసులు వేణు, ప్రవీణ్, ముఖేష్, కార్తిక్, నాగులుతో ఆమెను కట్టపైకి తీసుకొచ్చి ప్రథమ చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. ఎంతో ధైర్యసహసాలతో మహిళను రక్షించిన జగదీశ్‌ను 3వ బెటాలియన్ కమాండెంట్ సయ్యద్ జమీల్‌పాష, అడిషనల్ కమాండెంట్ శ్రీనివాస్‌రావు, ఎస్‌డీఆర్‌ఎఫ్ ఇన్‌చార్జి మహేశ్‌లు శాలువ కప్పి, సన్మానించి అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment