డబ్బికార్ శ్రీనివాస్‌కు అవార్డు ప్రదానం నేడు
ఇబ్రహీంపట్నం: ఆరెకటిక సంఘం జాతీయ నాయకుడు, ఇబ్రహీంపట్నానికి చెందిన డబ్బికార్ శ్రీనివాస్ సేవలను గుర్తించిన వల్లూరి ఫౌండేషన్ అతన్ని బంగారు నంది అవార్డుకు ఎంపిక చేసింది. నగరంలోని రవీంద్రభారతిలో ఆదివారం శ్రీనివాస్‌కు అవార్డు ప్రదానం చేయనున్నారు.
విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి
కొత్తూరు: విద్యుదాఘాతంతో ఓ కార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన కొత్తూరు పట్టణ సమీపంలోని వినాయకస్టీల్ ఐరన్ పరిశ్రమలో శనివారం చోటు చేసుకుంది. సీఐ నర్సింహారావు తెలిపిన ప్రకారం.. ఒడిస్సా రాష్ట్రానికి చెందిన ప్రీతంకుమార్(19) ఐరన్ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కాగా విధుల్లో భాగంగా ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మరమ్మతులు చేస్తుండగా విద్యుత్‌షాక్‌కు గురయ్యాడు. గమనించిన పరిశ్రమ యాజమాన్యం చికిత్స నిమిత్తం హైద్రాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment