
ఘనంగా సందల్ ఊరేగింపు
పహాడీషరీఫ్: పహాడీషరీఫ్ బాబా షర్ఫూద్దీన్ దర్గా సందల్ ఊరేగింపు ఆదివారం ఉదయం వైభవంగా కొనసాగింది. 759వ ఉర్సు ఉత్సవాలలో భాగంగా బాలాపూర్‌లో బాబా అడుగీడిన నివాసం నుంచి శనివారం అర్ధరాత్రి ప్రత్యేక ప్రార్థనలనంతరం సందల్ ఊరేగింపు ప్రారంభమయ్యింది. కొత్తపేట, వెంకటాపూర్, షాహిన్‌నగర్, జల్‌పల్లి కమాన్‌ల మీదుగా ఉదయం 9 గంటలకు పహాడీషరీఫ్ దర్గాకు చేరుకుంది. అనంతరం గంధంను కొండపై ఉన్న షర్ఫూద్దీన్ బాబా సమాధిపై ఉంచి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. వేలాది మంది పాల్గొంటున్న ఊరేగింపు కావడంతో పహాడీషరీఫ్, బాలాపూర్ పోలీసులు అదనపు బలగాలతో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. మహేశ్వరం డీసీపీ సునితా రెడ్డి, ఏసీపీ లక్ష్మీకాంతరెడ్డి, పహాడీషరీఫ్, బాలాపూర్‌ల ఇన్‌స్పెక్టర్లు గురువారెడ్డి, సుధాకర్‌లు బందోబస్తును పర్యవేక్షించారు. ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్ పాల్గొని ప్రార్థనలు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దేప భాస్కర్ రెడ్డి తలపై పూలు, చాదర్‌తో వెళ్లి సమర్పించారు. కార్యక్రమంలో నాయకులు యూసుఫ్ ఖాద్రీ, కొండల్‌యాదవ్, యాదగిరి, దస్తగిర్, అబ్దుల్లాబిన్ అవద్, శ్రీధర్, రవికుమార్ పాల్గొన్నారు.
పహాడీషరీఫ్ దర్గా వద్ద వేలాది భక్తజనం

ఘనంగా సందల్ ఊరేగింపు

ఘనంగా సందల్ ఊరేగింపు
Comments
Please login to add a commentAdd a comment