బీటీ రోడ్లు నిర్మించండి
మంచాల: గ్రామాల్లో బీటీ రోడ్లు నిర్మించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని చెన్నారెడ్డిగూడలో పార్టీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా యాదయ్య మాట్లాడుతూ.. గతంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి 15 ఏళ్లు అధికారంలో ఉండి చెన్నారెడ్డిగూడ, బండలేమూరు, అజ్జినతండా గ్రామల్లో సీపీఎం బలంగా ఉందని వివక్ష చూపి రోడ్డు నిర్మించకుండా కాలం వెళ్లదీశారని ఆరోపించారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఈ గ్రామాలకు రోడ్డు నిర్మిస్తున్నామని చెప్పి చెన్నారెడ్డిగూడలో శిలాఫలకం వేసి దాదాపు సంవత్సరం అవుతున్నా ఇప్పటికీ చలనం లేదన్నారు. ఈ గ్రామాల్లో రోడ్లు అస్తవ్యస్తంగా మారాయన్నారు. ప్రభుత్వానికి కనీసం ఎన్నికల హామీలను అమలు చేసే పరిస్థితి లేదన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో చెన్నారెడ్డిగూడ, బండలేమూరు, అజ్జినతండా గ్రామాలను ఏకం చేసి పోరు చేస్తామన్నారు. నూతన రోడ్డు సాధించేవరకు అధికారులు, నాయకులను నిలదీస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి వర్గసభ్యుడు స్వామి, నాయకులు పాండు, చంద్రయ్య, మోతిలాల్, సురేష్, వెంకటేష్, ప్రహ్లాద్, కృష్ణ్ణ, ప్రవీణ్, జంగయ్య, పరమేశ్, భిక్షపతి, ఇబ్రహీం, ,లచ్చిరాం, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య
Comments
Please login to add a commentAdd a comment