విభజించు.. మోసగించు!
సాక్షి, సిటీబ్యూరో: సైబర్ నేరగాళ్ల మోసాలపై ప్రజల్లో అవగాహన వచ్చేలోగా.. వారు కొత్త పంథాను ఎంచుకుంటున్నారు. ఒకప్పుడు బ్యాంకు వివరాల అప్డేట్, క్రెడిట్ కార్డు, వర్క్ ఫ్రమ్ హోమ్ పేర్లతో వల వేసేవారు. ఇప్పుడు రూటు మార్చి వ్యక్తులు, వారి వయస్సుల ఆధారంగా దోచేస్తున్నారు. వృద్ధులైతే కరెంటు, నల్లా బిల్లులు కట్టలేదంటూ.. మహిళలు, గృహిణులకు తక్కువ ధరతో గృహోపకరణాలు, యువకులైతే క్రిప్టో కరెన్సీ పెట్టుబడులకు లాభాలంటూ వల విసిరి నిండా ముంచుతున్నారు.
డేటాతోనే అసలు గుట్టంతా..
సైబర్ నేరాలకు మూలం ప్రజల వ్యక్తిగత వివరాలు అంగట్లో సరకులా మారడమే. ప్రజల డేటా విభజించుకుని దాని ఆధారంగా మోసాలు చేస్తున్నారు. వీటికితోడు గూగుల్లో తప్పుడు ప్రకటనలు, నకిలీ వెబ్‌సైట్లు భారీగా పుట్టుకొస్తున్నాయి. ఏ అంశంపై సెర్చ్ చేసినా దానికి సంబందించిన ప్రకటనలు తెరపైకి వస్తుంటాయి. ప్రత్యేక సందర్భాల్లో కొన్ని సంస్థలకు వ్యక్తిగత వివరాలు అందిస్తుంటాం. ఇవన్నీ నేరగాళ్లకు చేరుతున్నాయి. ఇవే వివరాలతో మోసగాళ్లు ఫోన్‌లో సంప్రదించి డబ్బు కొల్లగొడుతున్నారు.
మోసాల్లో వీరే ఎక్కువ..
ఇటీవలి కాలంలో నగరంలో డ్రగ్స్ పార్సిల్ వచ్చిందంటూ కస్టమ్స్, సీబీఐ, ఎన్సీబీ అధికారులమంటూ ఫోన్లు చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ తరహా మోసాలపై ఒక్క సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే ఈ ఏడాది దాదాపు 200 వరకు ఫిర్యాదులు అందాయి. బాధితుల్లో యువతే ఎక్కువ. తక్కువ ధరకు గృహోపకరణాలు, ఇంట్లో ఉంటూ ఉద్యోగం తదితర మోసాల బాధితుల్లో మహిళలే ఎక్కువగా ఉన్నారు. కస్టమర్ కేర్, క్రిప్టో కరెన్సీ, పెట్టుబడికి రెండింతల లాభాలు, లోన్ యాప్ మోసాల్లో 20 40 ఏళ్ల లోపు వారు అధికం. సైబర్ మోసాల బారిన పడితే ఆలస్యం చేయకుండా 1930 టోల్ ఫ్రీకి, పోలీసులకు ఫిర్యాదు చేయాలని సైబర్ క్రైం పోలీసులు సూచిస్తున్నారు.
సైబర్ నేరగాళ్ల కొత్తపంథా
వర్గాల వారీగా గుర్తించి వల
ఏమరపాటుగా ఉంటే ఖాతాలు ఖాళీ
Comments
Please login to add a commentAdd a comment