అడవిలో మంటలార్పిన హెడ్‌కానిస్టేబుల్
ఇబ్రహీంపట్నం రూరల్: పోలీసంటే ఉద్యోగమే కాదు సామాజిక బాధ్యతని నిరూపించాడో హెడ్‌కానిస్టేబుల్. అడవిలో మంటలు ఎగిసిపడుతుండగా కర్రకు బట్ట కట్టి అదుపు చేసి శభాష్ అనిపించుకున్నాడు. ఆదివారం ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని బొంగ్లూర్ ఔటర్ సర్వీస్ రోడ్డు పక్కనే ఉన్న చెట్లకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. దీంతో అటువైపు వెళ్తున్న పెట్రోలింగ్ మొబైల్ ఉన్న హెడ్‌కానిస్టేబుల్ బాల్‌రాజ్‌యాదవ్ గమనించాడు. వెంటనే కారు దిగి పెద్ద కర్రకు బట్టను కట్టి వ్యాప్తి చెందకుండా అడ్డుకున్నాడు. అతనితో పాటు ఉన్న రామకృష్ణ అనే డ్రైవర్ ఫైర్‌స్టేషన్‌కు ఫోన్ చేసి రప్పించాడు. అరగంట పాటు బాల్‌రాజ్‌యాదవ్ శ్రమించిన తీరును స్థానికులు మెచ్చుకున్నారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి పూర్తిగా మంటలు ఆర్పివేశారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment