అమీర్‌పేట: స్నాప్ చాట్ ద్వారా పరిచయమైన ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఓ యువకుడు ఆమె పేరిట రుణం తీసుకుని తప్పించుకొని తిరుగుతున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన యువతికి కూకట్‌పల్లి సమీపంలోని గోపాల్‌నగర్‌కు చెందిన ధీరజ్‌రెడ్డి (26)తో స్నాప్ చాట్ ద్వారా పరిచయం ఏర్పడింది. నీవు నాకు నచ్చావని, ఇంట్లో పెద్దవారితో చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అనంతరం సదరు యువతి పేరున ఆన్‌లైన్ యాప్ ద్వారా రుణాలు తీసుకున్నాడు.అలాగే కారు, స్కూటీతో పాటు ఐపాడ్ ఇంటి వస్తువులు కొనుగోలు చేశాడు. ఆ తర్వాత గత నవంబర్ నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో బాధితురాలు ఇటీవల ధీరజ్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఈ విషయాన్ని అతడి తల్లిదండ్రులకు చెప్పింది. సానుకూలంగా స్పంచిందినట్లు నటించిన వారు అప్పటికి ఆమెకు నచ్చజెప్పి పంపారు. మర్నాడు ఆమె వారికి ఫోన్ చేయగా బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
● స్నాప్ చాట్‌లో పరిచయం
● ఆమె పేరుతో రుణం
● కారు, బైక్ కొనుగోలు
● నిందితుడిపై కేసు నమోదు
Comments
Please login to add a commentAdd a comment